మనలో చాలామంది వివిధ దంత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా దంతాలు పసుపు పచ్చగా మారడం, గార పట్టడం, పుచ్చి పోవడం, నోటి నుండి దుర్వాసన రావడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉపశమనం పొందడం కోసం వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వాటితో పాటు ఒక్కసారి ఈ చిట్కా కూడా ట్రై చేసి చూస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం చేసుకోవచ్చు..
కాఫీ, టీలను అధికంగా తాగే వారికి దంతాలు ఎక్కువగా గార పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దంతాలను తెల్లగా మార్చుకోవడం కోసం చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటి వారు ఎలాంటి ఖర్చులేకుండా దంతసమస్యలకు త్వరగా చెక్ పెట్టండిలా..గ్రామాలలో అధికంగా ఉండే బర్రెక చెట్లను ఉపయోగించి మనం మన దంతాల సమస్యలను నయం చేసుకోవచ్చు.
దంతాలు ఆరోగ్యంగా, బలంగా, అందంగా తయారు చేయడంలో ఈ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజూ బర్రెక చెట్టు ఆకులతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారడమే కాకుండా ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. ఈ చెట్టు పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల పిప్పి పన్ను సమస్య తగ్గడమే కాకుండా..పసుపు పచ్చ దంతాలు తెల్లగా మారుతాయి.