బీ కేర్ ఫుల్.. కొత్తగా మరో రెండు వేరియెంట్లు

0
87

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకొని..ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది.  ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ ప్రజలపై విరుచుకుపడుతుంది. గత రెండేళ్లుగా ప్రజలను పట్టి పీడిస్తుంది.

కాస్త ఇప్పుడే కరోనా నుంచి కోలుకొని..భయవిముక్తులు అవుతున్న ప్రజలను మళ్ళి ఇరకాటంలో నెట్టేయడానికి మరో రెండు కొత్త వేరియెంట్ లు పుట్టుకొచ్చాయి. ఆల్ఫా, బీటీ, డెల్టా, ఓమిక్రాన్, ప్రస్తుతం ఓమిక్రాన్ XE, ఇలా వరసగా వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

తాజాగా ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు అయినా బీఏ 4, బీఏ 5 దక్షిణాఫ్రికా పరిశోధకులు గుర్తించారు. కానీ ఈ వేరియెంట్ లపై ఇంకా కేసులు, మరణాలు సంభవించలేదని తెలిపారు. ఇది ప్రస్తుతం బోట్స్ వానా, బెల్జియం, డెన్మార్క్, బ్రిటన్, జర్మనీ దేశాలలో విస్తరించినట్టు పరిశోధకులు వెల్లడించారు. మరి ఈ వేరియంట్లు ఎంతమంది ప్రాణాలు బలితీసుకుంటాయో చూడాలి.