ఏ వైరస్ వచ్చినా మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది, ఇప్పుడు ఈ కరోనా వైరస్ కూడా అలాంటిదే, అందుకే మనిషికి కచ్చితంగా రోగ నిరోధక వ్యవస్ధ బాగుండాలి అని అంటున్నారు వైద్యులు, ముఖ్యంగా సి విటమిన్ ఉండే సిట్రిస్ ఫలాలు తీసుకోవాలి, ఇలాంటివి తీసుకుంటే ఎలాంటి జబ్బులు మనకు రావు అంటున్నారు వైద్యులు.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాస్త గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది. ,మీరు మరీ వేడి నీటిలో మరీ చల్లని నీటిలో నిమ్మరసం వేయకూడదు నిమ్మ రసం లాభాలు పోతాయి, కేవలం గోరు వెచ్చని వాటిలో వేయాలి.
ఇలా నిమ్మరసం తీసుకుంటే మీకు ఏ జబ్బు రాదు, అంతేకాదు జలుబు గొంతు నొప్పి అస్సులు మీ దరిచేరవు..నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్య ఔషధంగా సహాయపడుతుంది. ఇక పంటి బాధలు ఉన్నా పోతాయి, శరీరంలో విషపదార్దాలు అన్నీ చెమటరూపంలో పోతాయి.