ఆగని కరోనా ఉధృతి..మూడో రోజు 20 వేలకు పైగా కొత్త కేసులు

0
94

ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 20,044 మంది వైరస్​ బారినపడగా.. మరో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 18,301 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.32 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతంగా ఉంది.

మొత్తం కేసులు : 4,37,30,071

మొత్తం మరణాలు:5,25,660

యాక్టివ్​ కేసులు: 1,40,760

కోలుకున్నవారి సంఖ్య: 4,30,63,651