రోజూ ఐదు లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది… వైద్యులు కూడా ఇదే చెబుతారు, మంచి నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని మనకు తెలిసిందే, అయితే కిడ్నీ సమస్యలు దూరం అవ్వాలి అన్నా నీరు ఎక్కువగా తీసుకోవాలి.
ఇక మీరు నీరు అతిగా ఒకేసారి రెండు లీటర్లు ఎప్పుడూ తాగవద్దు.. ఓ గ్లాస్ వాటర్ తాగి మళ్లీ దాహం వేసిన సమయంలో మరో గ్లాస్ వాటర్ తీసుకోవాలి..యూరిన్ ఎలాంటి కలర్ లేకుండా లేదా లైట్ యెల్లో కలర్‌లో ఉండేట్లు చూసుకుంటే సరిపోతుంది.
డార్క్ యెల్లో కలర్‌లో యూరిన్ ఉంటే నీరు ఇంకా తాగాలని అర్ధం. ఒకవేళ మీరు యూరిన్ కు వెళ్లిన సమయంలో తెల్లగా యూరిన్ వస్తుంది అంటే మీకు ఎలాంటి సమస్య లేదు అని అర్దం, ఎల్లోగా వస్తోంది అంటే మీరు తాగుతున్న నీరు సరిపోలేదు అని అర్దం.