పెరుగుతో ఎన్ని ప్రయోజనాలో తప్పక తెలుసుకోండి

పెరుగుతో ఎన్ని ప్రయోజనాలో తప్పక తెలుసుకోండి

0
91

మన శరీరానికి మంచి బలం చేకూర్చే ఆహరంలో పాలు ఎలాగో పెరుగు అలాంటిదే, నిత్యం పెరుగు తినే వారికి ఎముకలు బలంగా ఉంటాయి, పెరుగు లేదా మజ్జిగ చేసుకుంటే మంచి బలం వస్తుంది
పెరుగు రోగనిరోధక శక్తిని పెంచి చక్కని ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇక జీర్ణవ్యవస్ధ బాగుంటుంది, కడుపు నొప్పి అల్సర్లు ఉండవు.

ఏ వయసు వారు అయినా పెరుగు తీసుకోవచ్చు, అరుగుదల బాగుంటుంది, ఇక సౌందర్యపరంగా కూడా పెరుగు వాడవచ్చు.పెరుగులో, కలబంద గుజ్జుని కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతి వంతంగా మారుతుంది.

ఇక పెసరపిండి శనగపిండి కూడా కలిపి పెరుగుతో ముఖానికి పట్టిస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
ముఖం మీద జిడ్డు తగ్గి మొటిమల బెడద కూడా తగ్గాలి అంటే శనగపిండి తెనె పెరుగు మిశ్రమం ముఖానికి రాయాలి, అలాగే కీర దోసముక్కలు పెరుగులో వేసి పేస్టులా చేసి ముఖానికి రాయండి.. మృతకణాలు పోతాయి. నల్లని మచ్చలు వలయాలు తొలగిపోతాయి.