స్మార్ట్ ఫోన్ల వాడకం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. చిన్నారుల నుండి పెద్దలవరకు అందరూ స్మార్ట్ వాన్ వాడేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రోజు మొత్తం సెల్ ఫోనే లోకంగా చాలా మంది భావిస్తున్నారు. ప్రతి ఒక్క సమాచారం ఫోన్లలో లభించడంతో..అందరూ వాటికి అలవాటు అయిపోయారు. నిద్రపోయే ముందు, నిద్రపోకుండా చాలా మంది స్మార్ట్ ఫోన్ వాడేస్తుంటారు. ఇలా చేయటం వల్ల అనేక అనర్థాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిద్రకు ముందుగా స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల తలనొప్పి, కంటి నుంచి నీళ్లు కారటం, కళ్లు పొడిబారి దురదలు రావటం, నిద్రలేమి వంటివి ఉంటాయి. మనం నిద్రపోవడానికి అరగంట ముందు స్మార్ట్ ఫోన్ ను వాడటం ఆపేయాలి. ఒకవేళ స్మార్ట్ ఫోన్ ను అదేవిధంగా వాడితే వాటి కాంతి కారణంగా నిద్రలేమి సమస్యలు మనకు తలెత్తుతాయి. నిద్రకు అరగంట ముందే ఫోన్ ఆఫ్ చేయాలి. ఫోన్ ఎక్కువగా వాడటం కారణంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా ఎలక్ట్రానిక్ మాగ్నెటిక్ రేస్ విపరీతంగా రావడం కారణంగాక్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అనేమ మంది తమ మొబైల్ ఫోన్ ను కింది జేబులో పెట్టుకుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. దీని వల్ల రేడియేషన్ అనేది మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా పురుషుల్లో ఉండే స్పెర్మ్ కౌంట్ విపరీతంగా పడిపోతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. తద్వార సంతాన సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే వారు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. స్క్రీన్ లైట్ ఎక్కువగా ఉండకూడదు, అలా అని మరీ తగ్గించి కూడా ఉంచొద్దు. 25% నుంచి 35% బ్రైట్‌నెస్ ఉంటే చాలు. చీకట్లో కూర్చోకూడదు. మంచి లైటింగ్ ఉన్న ప్లేస్‌లో కూర్చోవాలి. ఇలా చేయండి మీ ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి.