ఇక నో టెన్షన్..త్వరలో మంకీపాక్స్ కు వ్యాక్సిన్..కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన

0
108

ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ టెర్రర్ పుట్టిస్తుంది. రానున్న రోజుల్లో ఈ వ్యాధి ఉధృతి అధికం కానుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.

ఇప్పటికే కేర‌ళ‌లో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య 5కు చేరుకున్న‌ది. ఇక దేశ‌వ్యాప్తంగా ఆ వైర‌స్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవియా మంకీపాక్స్‌పై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. మంకీపాక్స్‌ కొత్త వైరస్‌ ఏం కాదు. భారత్‌కు, ఈ ప్రపంచానికి అది కొత్తేం కాదు. దశాబ్దాల నుంచే ఆఫ్రికాలో ఉంది. అయితే వైరస్ కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేశామన్న మంత్రి.. వ్యాక్సిన్ విషయంలోనూ చకచకా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.