వడదెబ్బ తగలకుండా ముందు ఈ జాగ్రత్తలు తీసుకుండి

వడదెబ్బ తగలకుండా ముందు ఈ జాగ్రత్తలు తీసుకుండి

0
99

ఈ వేసవి ఎలా ఉందో చూశారా మండిపోతున్నాయి ఎండలు, దారుణంగా సూర్యుడు మండిపోతున్నాడు, ఇక అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అయితే ఈ ఎండల సమయంలో మనం ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి.

వేసవిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరం అదుపు తప్పుతుంది. ఇక చల్లని ప్రాంతంలో ఉండండి, నీరసంగా ఉంటే పంచదార నిమ్మరసం నీటిని తాగండి.

కాచి చల్లార్చిన నీటిని తాగండి, కొబ్బరిబొండాలు బెటర్, మజ్జిగ తాగాలి, కూల్ డ్రింకులు ఐస్ క్రీమ్స్ వంటి వాటికి దూరంగా ఉండండి..నిమ్మ రసం, కొబ్బరి నీరు, గ్లూకోజ్ తీసుకోండి.. ఇంట్లో ఎలక్ట్రోరల్ ఫౌడర్ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇంట్లో ఉంచుకోండి. ఐస్ క్యూబ్స్ చల్లగా మీ శరీరం పై పెట్టుకుంటే వడదెబ్బ తగిలినా అది మీకు అంత ప్రభావం ఉండదు.