వేడి వేడిగా టీ తాగే అలవాటు ఉందా? జర ఆగండి ఇది చదవండి

వేడి వేడిగా టీ తాగే అలవాటు ఉందా? జర ఆగండి ఇది చదవండి

0
91

తలనొప్పి వచ్చినా ఏదైనా విసుగు వచ్చినా వెంటనే ఓ కప్ టీ పడాల్సిందే, లేకపోతే మైండ్ పనిచేయదు అంటారు చాలా మంది, అంతేకాదు ఇలా టీ తాగకపోతే ఆ పని ముందుకు సాగదు, అయితే కొందరు పొగలు కక్కేలా ఉన్న టీ తాగుతారు.. నాలుక సుర్రమని కాలినా దానిని అలాగే ఆస్వాదిస్తారు.

అయితే జర ఆగాలి, ఎందుకు అంటే ఇలా వేడి వేడి టీ తాగితే కడుపులో కొన్ని సమస్యలు వస్తాయి.
ఇలా తాగితే అన్నవాహికకి కాన్సర్ వచ్చే ప్రమాదముందంటున్నారు నిపుణులు. 75 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ వేడితో టీ తాగితే, క్యాన్సర్ వస్తుందట.

అంతేకాదు అల్సర్ సమస్య ఉంటే అది మరింత పెరిగే ప్రమాదం ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉన్న వారిపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది, అంతేకాదు చెమటలు పట్టడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు, ఇక టీ తీసుకుంటే మినిమం 3 నిమిషాలు ఆగండి.. కాస్త చల్లారిన తర్వాత తాగండి.. అంటే గోరు వెచ్చగా అంతేకాని పొగలు కక్కేలా వద్దు.