Acidity Problem | ఎసిడిటీ సమస్యా.. వీటికి దూరంగా ఉండాల్సిందే..

-

ఎసిడిటీ(Acidity Problem).. ప్రస్తుతం వంద మందిలో తొంభై మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీని నుంచి ఉపశమనం పొందడం కోసం ప్రతి రోజూ ఉదయాన్ని ట్యాబ్లెట్‌తోనే ప్రారంభించేవారు ఎందరో ఉన్నారు. ఇంకొందరు ఆహారం తిన్న వెంటనే టాబ్లెట్ పడకపోతే తట్టుకోలేరు. మరికొందరు ఈ ఎసిడిటీ నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల రెమెడీస్ వాడుతుంటారు. చాలా మంది డైట్ కూడా పాటిస్తారు. అయినా ఎసిడిటీ సమస్య మాత్రం సతమతం చేస్తూనే ఉంటుంది. అయితే అసలు ఈ ఎసిడిటీకి మన జీవనశైలి, అలవాట్లే ప్రధాన కారణమవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్ వల్ల, జంక్ ఫుడ్‌కు అలవాటు పడిపోవడం వల్ల ఈ ఎసిడిటీ సమస్య అధికంగా ఉంటుంది. ఎసిడిటీ ఉంటే కడుపంతా ఉబ్బరంగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదీ తినాలన్న కోరిక కూడా కలుగదు. ఎసిడిటీ వల్ల మరెన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెప్తున్నారు.

- Advertisement -

గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా తీవ్రమైన కడుపు నొప్పి, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఒక్కోసారి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అధికంగా ఉంటే జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఒక్కోసారి గుండె చుట్టుపక్కల కూడా సూదితో పొడిచినట్లు నొప్పి వచ్చి ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. మరి ఈ ఎసిడిటీని ఎలా కంట్రోల్ చేయాలంటే మాత్రం అదంతా కూడా మన ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎసిడిటీ ఉన్న వారు కొన్ని రకాల కూరగాయలకు కూడా దూరంగా ఉండాల్సిందేనని అంటున్నారు. వాటికి అతిగా తినడం కాదు పూర్తిగా మానేయడం కూడా మంచిదే అవుతుందని, కాకపోతే బాగా అలవాటు అయిన వారు తక్కువ మోతాదులో తినడం మంచిదని చెప్తున్నారు. మరి ఆ కూరగాయలేంటో చూసేద్దామా..

వంకాయ: కూరగాయల రారాజుగా వంకాయను చెప్పుకుంటారు. దీనిని ఎలా వండుకున్నా అద్భుతమైన రుచిని ఇస్తాయని చెప్తుంటారు. వీటిలో గుత్తొంకాయ కూర అంటే చాలా మంది లొట్టలేసుకుంటూ ఓ పట్టు పట్టేస్తారు. కొందరికి మాత్రం వంకాయ పడదు. దీనిని తింటే అలర్జీస్ వస్తాయి. అయితే ఈ వంకాయలను తినడం వల్ల ఎసిడిటీ అధికమవుతుందని, కడుపులో ఆమ్లత్వం ఏర్పడి ఎసిడిటీ సమస్య అధికమవుతుందని నిపుణులు చెప్తున్నారు. గ్యాస్ ట్రబుల్(Acidity Problem), కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు వంకాయలకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నప్పుడు వీటిని తింటే ఈ సమస్యలు మరింత అధికమవుతుందని చెప్తున్నారు. దీంతో పాటుగా వంకాయలు మలబద్దకాన్ని కూడా పెంచుతాయని అంటున్నారు.

బంగాళదుంప: అత్యధిక మంది ఇష్టపడే కూరగాయల్లో బంగాళదుంప టాప్‌లో ఉంటుందని చెప్పడం అతిశయోక్తేమీ కాదు. కూరల్లోనే కాకుండా.. ఫాస్ట్ ఫుడ్‌లో కూడా బంగాళదుంప చాలా స్పెషల్. కానీ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు మాత్రం బంగాళదుంపులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెప్తున్న మాట. బంగాళదుంపల్లో పిండి పదార్థం అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుందని, కాబట్టి వీటిని ఎక్కువగా తింటే ఎసిడిటీ సమస్య అధికమవుతోందని నిపుణులు వివరిస్తున్నారు.

పన్నీర్: ప్రస్తుతం చాలా మంది తినడానికి ఆసక్తి చూపుతున్న ఆహార పదార్థాల్లో పన్నీర్ కూడా ఒకటి. పన్నీర్ బిర్యానీ, పన్నీర్ కుర్మా, ఆలూ పన్నీర్ ఇలా మరెన్నో రకాలుగా పన్నీరు‌ను తింటున్నారు. కానీ పన్నీర్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందని వైద్యులు అంటున్నారు. పన్నీర్ ఎక్కువగా తింటే జీర్ణప్రక్రియ మందగిస్తుందని, దీని వల్ల ఎసిడిటీ సమస్య ఏర్పడుతుందంటున్నారు. దీంతో పాటుగా మలబద్దక సమస్యను కూడా పన్నీర్ పెంచుతుందని, కాబట్టి పన్నీర్‌కు చాలా మితంగా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

నిమ్మకాయ: గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయకు కూడా దూరంగా ఉండటం మంచిదని చెప్తున్నారు వైద్యులు. నిమ్మకాయ జీర్ణప్రక్రియపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని, ఎసిడిటీ సమస్యలను ఇది అధికం చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు నిమ్మకాయకు కూడా దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్యులు.

కాలీఫ్లవర్: క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి కూడా ఎసిడిటీ సమస్యను అధికం చేస్తాయని వైద్యులు అంటున్న మాట. వీటిలో రాఫినోస్ అధికంగా ఉంటుందని, ఇది మన శరీర బరువుతో పాటు ఎసిడిటీని కూడా అధికం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఎసిడిటీ సమస్య ఇప్పటికే ఇబ్బంది పెడుతుంటే మాత్రం వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

టమాటా: ఏ వంటలో అయినా టమాటా తప్పకుండా ఉండాల్సిందే. టమాటా లేని కూరలు చాల తక్కువగా ఉంటాయి. అది వెచ్ అయినా నాన్ వెచ్ అయినా. కానీ ఎసిడిటీ సమస్య(Acidity Problem) ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. టమాటాలు అధికంగా తింటే ఎసిడిటీతో పాటు అజీర్తి కూడా పెరుగుతుందని, కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలను కూడా మితంగానే తినాలని చెప్తున్నారు వైద్యులు.

అయితే ఆహార పదార్థం ఏదైనా మితంగానే తినాలని, అలా కాకుండా ఎంతపడితే అంత ఇష్టమొచ్చినట్లు తింటే ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని వైద్యులు అంటున్నారు. ఎంతో మేలు చేసే కూరగాయలు కూడా అతిగా తినడం వల్ల మన శరీరం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి, తీవ్ర ఇబ్బందికి గురి చేస్తాయని అంటున్నారు. ఆహారం ఏదైనా ఎంత తినాలో అంతే తినాలని, అతిగా తింటే సమస్యలు తప్పవని సూచిస్తున్నారు.

Read Also: అమితాబ్ మాటలు విని వణుకు పుట్టింది: చిరంజీవి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...