ఏ కూరగాయతో ఏమి లాభమో తెలుసుకోండి

ఏ కూరగాయతో ఏమి లాభమో తెలుసుకోండి

0
89

ఈ కరోనా సమయంలో చాలా వరకూ ఎలాంటి ఫుడ్ తినాలి అనే విషయంపై అందరూ ఆలోచన చేస్తున్నారు… ఇమ్యునిటీ పవర్ వచ్చే కూరగాయలు పండ్లు ఒకే మరి ఏ ఫుడ్ తింటే ఇంకా మంచిది అని చూస్తే నిపుణులు కూడా కొన్ని చెబుతున్నారు.

మీరు క్యారెట్ తింటే ఎంతో మంచిది.. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, మీరు ఉడబకెట్టి తిన్నా పచ్చిగా తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇక కాకరకాయ అమ్మో చేదుగా ఉంటుంది అని చాలా మంది భయపడతారు… కాని ఇది ఆరోగ్యానికి చాలా మంచిది …షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి, ఇది జ్యూస్ గా లేదా పులుసు అయినా చేసుకోవచ్చు.
మలబద్దకం ఉండదు, అల్సర్లు ఇన్ పెక్షన్లు తగ్గుతాయి. కాకర జ్యూస్ తాగితే లివర్ సమస్యలు తగ్గుతాయి.

ముల్లంగి – ఇది శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది. అందుకే ఈ కరోనా సమయంలో చాలా మంది ముల్లంగి తీసుకుంటున్నారు. ఎక్కువ కాకుండా వారానికి ఓసారి అయినా ముల్లంగి తినండి
దగ్గు, అలెర్జీ, జలుబులాంటివి తగ్గుతాయి.

ఇక ఆకుకూరలు మీరు ఆకుకూరలు ఏమి తిన్నా మంచిదే తోటకూర పాలకూర చుక్క కూర ఇవి పప్పు లేదా పులుసు రూపంలో తీసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది..

బీట్ రూట్ ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది… పిల్లలకు ఎదుగుతున్న వారికి ఎముకల పుష్టికి ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేస్తుంది, ఇది లివర్ పనితీరు మెరుగుపరుస్తుంది.

చిలకడదుంప : ఇది తెల్ల, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. జలుబు రాకుండా చేస్తుంది, ఒత్తిడి సమస్యలు దూరం అవుతాయి.