వెల్లుల్లి వల్ల ఉపయోగాలు తెలుసుకోండి ? ఇలా మాత్రం చేయవద్దు ?

వెల్లుల్లి వల్ల ఉపయోగాలు తెలుసుకోండి ? ఇలా మాత్రం చేయవద్దు ?

0
94

వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది అని చాలా మంది తీసుకోరు, కాని వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎన్నో పోషకాలు అలాగే శరీరానికి మేలు చేసే కారకాలు ఉన్నాయి… మన వంటి ఇంట్లో వెల్లుల్లి కచ్చితంగా ఉంటుంది.. ఇక ప్రతీ కూరలో అది ఇచ్చేరుచి అద్బుతం అనే చెప్పాలి.. వెల్లుల్లి అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది. మరి వెల్లుల్లి తీసుకుంటే ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనేది చూద్దాం.

 

దగ్గును నయం చేస్తుంది.. వెల్లులి కూరలో తీసుకున్నా లేదా వెల్లుల్లి రసం తీసుకున్నా మంచిదే …గొంతు నొప్పి నయమవుతుంది.. ఒక గ్లాసు వేడి నీటిలో కొన్ని చుక్కల వెల్లుల్లి రసం కలపండి దీంతో గార్లింగ్ చేయండి ఈజీగా తగ్గుతుంది.. ఇక కొందరికి ఉబ్బసం సమస్య ఉంటుంది అలాంటి వారు ఈ వెల్లుల్లి రసం ఉపయోగిస్తే చాలా ప్రయోజనం కలుగుతుంది..

వారానికి రెండు మూడు సార్లు వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.

 

 

మీ జుట్టు రాలిపోతుంటే, చుండ్రు సమస్య ఉంటే మీరు వెల్లుల్లి రసాన్ని ఉపయోగించవచ్చు. 2 టీస్పూన్ల వెల్లుల్లి రసం తీసుకోండి కొన్ని చుక్కల ఆవ నూనె వేసి మీ జుట్టు మూలాలపై రాయండి. ఇలా చేస్తే జుట్టు రాలడం అలాగే చుండ్రు సమస్య ఉంటే తగ్గుతుంది, అయితే చాలా మంది మొటిమలు తగ్గడానికి ఈ వెల్లుల్లి రసం వెల్లుల్లి పేస్టు మొటిమలపై రాస్తూ ఉంటారు, ఇలా చేయవద్దు, కొందరి స్కిన్ సెన్సిటీవ్ గా ఉంటుంది దీని వల్ల వారి చర్మంపై రాషెస్ వస్తాయి, ఇలా వెల్లుల్లి మొటిమల పై అప్లై చేయవద్దు అని వైద్యులు చెబుతున్నారు.