వెన్నునొప్పి అని ఆస్ప‌త్రికి వెళితే డాక్ట‌ర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు

వెన్నునొప్పి అని ఆస్ప‌త్రికి వెళితే డాక్ట‌ర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు

0
101

మ‌నిషికి కిడ్నీలు ఎంత ముఖ్య‌మో తెలిసిందే …ఒక కిడ్నీ చెడిపోతే కొంత కాలం రెండో కిడ్నీతో బ‌త‌క‌చ్చు కాని రెండు కిడ్నీలు చెడిపోతే అనారోగ్య‌పాల‌వుతాం, అయితే ఇప్పటి వ‌ర‌కూ విన‌ని విష‌యం ఏకంగా ఓ వ్య‌క్తికి మూడు కిడ్నీలు ఉన్నాయి, అయితే అత‌నికి కూడా త‌న‌కు మూడు కిడ్నీలు ఉన్నాయి అనే విష‌యం తెలియ‌దు.

బ్రెజిల్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి గత కొద్ది రోజులుగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతడు సావో పాలోని హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్క‌డ డాక్ట‌ర్లు అత‌నికి సిటీ స్కాన్ చేసి చూస్తే అత‌నికి మూడు కిడ్నీలు ఉన్నాయి అని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయారు, ఈ విష‌యం అత‌నికి చెప్పారు డాక్ట‌ర్లు.

అతడికి ఎడమ వైపున ఉన్న కిడ్నీ సాధారణంగానే ఉంది. అయితే, మిగతా రెండు కిడ్నీలు.. వెన్నెముక చివరి భాగంలో ఇరుక్కున్నట్లుగా ఉన్నాయి. దాని వ‌ల్ల నొప్పి వ‌స్తోంది అని చెప్పారు, ఇక ఆప‌రేష‌న్ చేసి తొల‌గించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు అని తెలిపారు, అంతేకాదు దాని వ‌ల్ల ఎలాంటి స‌మస్య లేద‌ని వెన్ను నొప్పి వ‌స్తే మాత్రం ఈ ట్యాబ్లెట్స్ వాడాలి అని తెలిపార‌ట‌, అత‌ను మాత్రం ఈ విష‌యం తెలిసి షాక‌య్యాడు.