వేపపుల్ల వాడండి దాని వ‌ల‌న క‌లిగే ప‌ది లాభాలు ఇవే

వేపపుల్ల వాడండి దాని వ‌ల‌న క‌లిగే ప‌ది లాభాలు ఇవే

0
134

మ‌న పెద్ద వారు గ‌తంలో ప‌ళ్లు తోముకోవ‌డానికి వేప పుల్ల బాగా వాడేవారు, అంతేకాదు క‌చ్చికిల బూడిద‌, బొగ్గు పొడి వేసుకుని ప‌ళ్లు తోమేవారు, కాని ఇప్పుడు అంతా పేస్టుల మ‌యం, మార్కెట్ అంతా పేస్టులు వ‌చ్చాయి.

రసాయనాలు, ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఇప్పుడు పేస్ట్ బ్ర‌ష్ కి వాడుతున్నారు.. వేపపుల్లతో నెలకు కనీసం ఒక్క సారైనా పళ్లు తోముకోవాలట. అలా తోముకుంటే కలిగే లాభాలు చాలా ఉన్నాయి, మ‌రి చూద్దాం

వేప‌లోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి, అందుకే దంతాల ద‌గ్గ‌ర చిగుర్లు ద‌గ్గ‌ర ఈ వేప పుల్ల పెట్ట‌గానే ఎలాంటి ఇన్ ఫెక్ష‌న్ ఉన్నా త‌గ్గిపోతుంది, ఆ వేప పుల్ల‌ని న‌మ‌ల‌డం వ‌ల్ల వ‌చ్చే ర‌సం చాలా మంచిది, అది దంతాల‌కు ఉన్న ఇన్ ఫెక్ష‌న్ త‌గ్గిస్తాయి. వేప పుల్ల‌తో తోముకుంటే నోటి నుంచి దుర్వాస‌న కూడా రాదు. పిప్పి ప‌న్ను ప‌న్ను పోటు ఉన్న‌వారు వేప పుల్ల పెట్టుకుని ప‌ళ్లు తోముకుంటే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.