వేపాకుతో చుండ్రుకి చెక్ పెట్టండిలా తప్పక తెలుసుకోండి

వేపాకుతో చుండ్రుకి చెక్ పెట్టండిలా తప్పక తెలుసుకోండి

0
121

వేప సర్వరోగ నివారిణి అనేది తెలిసిందే, అయితే వేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అనేక ఔషదాల తయారీలో కూడా వేపాకుని వాడతారు, అయితే ఈ ఆకు వల్ల శరీరంపై ఏమైనా చర్మ వ్యాధులు వచ్చినా తగ్గుతాయి, ముఖ్యంగా చాలా మంది ఉదయం వేపాకు తింటారు కూడా, శరీరంలో ఏదైనా చెడు ఉన్నా పోతుంది అని పెద్దలు నమ్ముతారు.

ఇక వేప పుల్లలతో పల్లు తోముకుంటారు, అయితే చుండ్రు పోవాలి అంటే వేపాకు బెస్ట్ అంటున్నారు..
చుండ్రు సమస్యతో బాధపడేవారికి ఇది సరైన పరిష్కారం. చుండ్రు సమస్యకు… గుప్పెడు వేపాకులను మూడు కప్పుల వేడి నీటిలో రాత్రంతా నాన బెట్టండి, ఆ వాటర్ లో ఉన్న ఆకులని పేస్ట్ చేయండి.

ఇక ఆ వాటర్ ని పారబోయకుండా తలకు పట్టించండి, ఆ పేస్టు ఉదయం స్నానానికి ముందు ఓ గంట తలకు పట్టిస్తే, కురులు దగ్గర చుండ్రుకి తగిలి తలలో ఉన్న చుండ్రు పోతుంది. ఇలా చేయడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ ను నిరోధిస్తుంది. అయితే తలలో పొక్కులు ఎర్రటి పుండ్లు వస్తే ఇది ట్రై చేయవద్దు.. ఒక్కోసారి రాషెస్ కింద వచ్చి దురద వచ్చినా వైద్యులని సంప్రదించండి, దీనికి కారణం ఆ ఫంగస్ మరింత పెరిగింది అని అర్ధం చేసుకోవాలి. అయితే చుండ్రు సమస్య ఉంటే ఇలా చేస్తే పోతుంది అంటున్నారు నిపుణులు.