వేప ఆకులు ఎంత ఉప‌యోగ‌క‌ర‌మో తెలుసా త‌ప్ప‌క తెలుసుకోండి

వేప ఆకులు ఎంత ఉప‌యోగ‌క‌ర‌మో తెలుసా త‌ప్ప‌క తెలుసుకోండి

0
94

మ‌న‌కు ఈ సృష్టిలో దేవుడు ఇచ్చిన ప్ర‌కృతి వ‌న‌రులు ఎన్నో ఉన్నాయి , అస‌లు ఏ ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా అన్నీ ఈ చెట్లు ఆకులు బెర‌డుల నుంచి ఔష‌దాలుగా మ‌నం త‌యారు చేస్తున్నాం, మ‌నం వేసుకునే అనేక ఇంగ్లీష్ మెడిస‌న్స్ కూడా ఈ ప్ర‌కృతి నుంచి వ‌చ్చే మొక్క‌ల నుంచి త‌యారు చేస్తున్నారు.

ఇందులో ముందు వ‌రుస‌లో ఉంటుంది వేప‌, అస‌లు వేప చెట్లు ఆకులు బెర‌డు కాండం కాయ‌లు ఇలా అన్నీ కూడా ఉప‌యోగ‌క‌ర‌మే, వేప చాలా మంచిది, ఇంటికి వంటికి కూడా చాలా మేలు చేస్తుంది, ఇక షుగ‌ర్ స‌మ‌స్య ఉన్నా, చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నా, ఇవ‌న్నీ వేప‌తో తొల‌గించుకోవ‌చ్చు.

ఇక షుగ‌ర్ వ‌చ్చింది అంటే చాలు అది త‌గ్గ‌దు అంటారు, అయితే చాలా మంది నాలుగు ఐదు వేప ఆకులు తింటే త‌మ‌కు షుగ‌ర్ స‌మ‌స్య ఉండ‌దు అని చెబుతున్నారు, చిన్న‌త‌నం నుంచి వేప పుల్ల ఆకుల గురించి పిల్ల‌ల‌కు చెబితే వారికి ఎంతో మేలు, ఇలా వేప ఆకులు రెండు రోజుల‌కి ఓ నాలుగ తిన్నా చాలా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌వు..

వేప‌ ఆకులతో వేప షర్బత్ తయారుచేసుకొని తాగితే, డయాబెటిస్ చాలా వరకూ కంట్రోల్ లో ఉంటుంది.లేకపోతే ప్రతి ఉదయము కొన్ని లేత వేప ఆకులను నమిలినా మంచి ప్రయోజనం ఉంటుంది. వేపాకులలో యాంటీ వైరల్ గుణాలు డయాబెటిస్ కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది. ఇలా వేప ఆకుల‌ని వాడితే అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.