వీగన్ ఫుడ్ తెలుసా – వీగన్స్ కు కాల్షియం ఏ ఫుడ్ ద్వారా వస్తుంది

వీగన్ ఫుడ్ తెలుసా - వీగన్స్ కు కాల్షియం ఏ ఫుడ్ ద్వారా వస్తుంది

0
106

వీగన్ ఫుడ్ ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు.. దీనిని శాఖాహారం అంటారు…ఇక జంతువులకి సంబంధించి ఫుడ్ ఎలాంటిది వీరు తీసుకోరు, జంతువుల నుంచి వచ్చే పదార్దాలు తీసుకోరు… అయితే మీకు డౌట్ వచ్చి ఉంటుంది పాలు పెరుగు ఇవి తీసుకుంటారా అని.. అవి కూడా ఆవు గేదె నుంచి వస్తాయి అందుకే ఆ ఆహారం తీసుకోరు.. పాలు, పెరుగు, పాల పదార్థాలు, తేనె, గుడ్లు, మాంసాహారం ముట్టుకోరు.

 

మరి వీరికి శరీరానికి కాల్షియం ఎలా అందుతుంది అని మీకు అనుమానం వచ్చే ఉంటుంది.

కాల్షియం కోసం క్యాబేజీ, బ్రోకలి, బెండకాయ తీసుకుంటే చాలా మంచిది.. ఆరోగ్యానికి ఎంతో బెటర్ అంటున్నారు నిపుణులు.

ఆకుకూరలు, ఫోర్టిఫై చేసిన సోయా పాలు, సోయా పనీర్, బాదం, ఆక్రోట్ గింజలు తీసుకుంటే మీకు ఈ శక్తి వస్తుంది.

 

అన్నీ రకాల పప్పులు రాజ్మా, నల్ల శనగలు, అలసందలు ప్రొటీన్లు అందిస్తాయి, కాల్షియం వస్తుంది. ఇక ఆకుకూరలు తీసుకుంటే మంచిది, ఇక జీడిపప్పు బాదం పిస్తా వల్ల మీకు అన్నీ రకాల ప్రొటీన్లు కాల్షియం అందుతుంది.