విటమిన్ డీ ఏ ఆహారంలో ఉంటుంది ఈ లోపం ఉంటే ఏం చేయాలో తెలుసుకోండి

విటమిన్ డీ ఏ ఆహారంలో ఉంటుంది ఈ లోపం ఉంటే ఏం చేయాలో తెలుసుకోండి

0
80

విటమిన్ల లోపం చాలా మందికి ఉంటుంది ..అయితే అన్నీ రకాల ఆహారాలు తింటే ఈ లోపం అనేది ఉండదు అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మన దేశంలో చాలా మందికి విటమిన్ డీ లోపం సర్వసాధారణం అయిపోయింది. అందుకే ఇటీవలి కాలంలో విటమిన్-డీ సప్లిమెంట్స్ కు విపరీతమైన డిమాండ్ వస్తోంది, మందుల రూపంలో వీటిని తీసుకుంటున్నారు.

సూర్యరశ్మిలో మాత్రమే కాకుండా మనం తినే కొన్ని ఆహారపదార్ధాల్లోనూ విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. రోజంతా ఎండలో ఉండకపోయినా ఉదయం ఓ అరగంట ఎండలో ఉంటే శరీరానికి కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా వస్తుంది.
ఎముకల పటుత్వాన్ని కాపాడుకోవాలంటే ఈ విటమిన్, మినరల్స్ రెండూ ఉండటం చాలా ముఖ్యం.

చేపల్లో విటమిన్ డీ ఎక్కువగా లభిస్తుంది… అది కూడా సాల్మన్ చేపలు తింటే ఎక్కువగా వస్తుంది, నెయ్యి, వెన్న, చీజ్, పన్నీర్ లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది వారానికి నాలుగు రోజులు ఇవి తీసుకున్నా మంచిదే.. అలాగే బ్రకోలీ ఆకుకూరలు, పాలకూరల్లో కూడా విటమిన్ డీ ఉంటుంది…సోయా పాలు ఆ ఉత్పత్తులు తీసుకున్నా మంచిదే కోడిగుడ్లలోని తెల్ల సొనలో కూడా ఉంటుంది ఇది కూడా వారానికి ఓసారి తీసుకోండి.