చాలా మంది విటమిన్ డి కోసం ఎండలో ఉంటారు, దాని నుంచి వచ్చే సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అధికంగా మన శరీరానికి అందుతుంది, అయితే ఎక్కువ సేపు కాకుండా మన పని మనం చేసుకుంటూ ఎండ తగులుతూ ఉన్నా విటమిన్ డి బాగా అందుతుంది..
మనిషి ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో ముఖ్యం..నేరుగా సూర్యరశ్మి ద్వారా కాకుండా ఇలా ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే మాత్రం చాలా కష్టం.ఒకవేళ వాడితే వైద్యుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు, దీని వల్ల శరీరానికి చాలా చేటు.
మందుల వల్ల విటమిన్ డీ ఎక్కువగా పొందాలి అనుకోవడం తప్పు అంటున్నారు. విటమిన్ డి మాత్రలు అధికంగా తీసుకుంటే శరీరంలో విష పదార్థాల శాతం పెరుగుతుందని, దేహంలో కాల్షియం స్థాయి కూడా ఎక్కువ అవుతుందని, ఆస్పత్రుల పాలయ్యే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు, ఇక ఈ ట్యాబ్లెట్స్ వాడేవారు శరీరంలో విటమిన్ డీ స్ధాయి ఎంత వరకూ ఉంది అనేది చూసి అప్పుడు వాడాలి అని చెబుతున్నారు వైద్యులు.