వీటి ద్వారా కరోనా రాదు డోంట్ వరీ ? తప్పక తెలుసుకోండి

వీటి ద్వారా కరోనా రాదు డోంట్ వరీ ? తప్పక తెలుసుకోండి

0
83

ఇప్పుడు ఎవరైనా తుమ్మినా దగ్గినా తుంపర్లు పడుతున్నా అందరూ వారికి దూరంగా ఉంటున్నారు జలుబు ఉన్నా సరే అక్కడ నుంచి అల్లంత దూరం పాటిస్తున్నారు, అయితే అది కరోనా ఎఫెక్టా లేదా సాధారణ ఫ్లూనా అనేది తెలియడం లేదు, సో ఈ సమయంలో నిపుణులు కూడా అసలు కరోనా ఎలా వస్తుంది వేటి వల్ల రాదు అనేది కూడా క్లారిటీ ఇస్తున్నారు.

ఎవరికి అయినా కరోనా ఉంటే ఆ కరోనా బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు, పాడినప్పుడు, అతడి నోటి నుంచి ముక్కు నుంచి వచ్చే చిన్న చిన్న తుంపర్ల ద్వారా పక్కన ఉన్న వారికి వస్తుంది.

అయితే తినే ఫుడ్ ప్లాస్టిక్ కవర్ల ద్వారా పేపర్ల ద్వారా మాత్రం కోరనా రాదు అని ఎలాంటి ఆధారాలు లేవు అని అంటున్నారు నిపుణులు…ప్లాస్లిక్ ఎన్వలప్స్ పేపర్ ల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతోందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని తెలిపారు. అలాగే 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కు మించి వేడి చేసే ఫుడ్ లో వైరస్ ఉన్నా ఆ వేడికి నశించి పోతుందని అన్నారు. ఇక ఫుడ్ ఐటెమ్స్ వేడి వేడి ఆహారంలో కూడా కరోనా ఉండదు, అని తెలిపారు నిపుణులు.