ఆరోగ్యంపై అవగాహన ఇప్పుడిప్పుడే అధికం అవుతోంది. యువత కూడా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఏం తింటే ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మన ఆరోగ్యానికి అక్రోట్లు(Walnuts) అద్భుతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇవి తినడం వల్ల ఆయుర్ధాయం కూడా పెరుగుతుందంటున్నారు నిపుణులు. అక్రోట్లలో పోషల విలువలు సమృద్ధిగా ఉంటాయని, ఇవి మన ఆరోగ్యానికి దివ్యఔషదంలా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ప్రొటీన్స్, ఫ్యాటీ యాసడ్స్, ఐరన్, మెగ్నీషియమ్, థీయమిన్, రిబోఫ్లోవిన్, విటమిన్ బీ6, బీ12, ఏ, సీ, ఈ, కే లతో పాటు మరెన్నో పోషకాలు అక్రోట్లలో ఉంటాయి. వీటిని ప్రతి రోజూ పరగడుపున తింటే ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. అక్రోట్స్ తింటే ఎలాంటి లాభాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్ఞాపకశక్తి పెరుగుదల: అక్రోట్రలు మన జ్ఞాపకశక్తికి దివ్యఔషధంలా పనిచేస్తాయి. శ్రద్ధ, ఏకాగ్రతను కూడా ఇవి పెంచుతాయి. ఇందులో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటాయి. ఇవి మన నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఆందోళన తగ్గించడంలో కూడా అక్రోట్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి మన మానసిక ఒత్తిడిని తగ్గించింది, మానసిక స్థితిని మెరుగు పరచడంలో కూడా అక్రోట్లు అద్భుతంగా పనిచేస్తాయి.
మానసిక ఆరోగ్యానికి పవర్ హౌస్: మన మానసిక ఆరోగ్యానికి అక్రోట్లు పవర్ హౌస్‌గా పనిచేస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల న్యూరోడెజెనరేటివ్ వ్యాధులను ప్రమాదం తగ్గుతుంది. వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదించేలా చేస్తాయి అక్రోట్లు. మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. దీంతో పాటు మన బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో కూడా అక్రోట్లు అద్భుతంగా పనిచేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు అక్రోట్లు దివ్యఔషధాలే. వీటిలో గ్లైసెమిక్ చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ సులభమవుతుంది.
బరువు తగ్గడం: శరీర బరువు నిర్వహణలో కూడా అక్రోట్లు కీలకంగా పనిచేస్తాయి.వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నా.. బరువు తగ్గడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. వాల్‌నట్స్(Walnuts)లో ఉండే ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు నిర్వహణలో కీలకంగా ఉంటాయి. ఇవి మనకు కడుపు నిండిన భావన కలిగించి మన క్యాలరీల ఇన్‌టేక్‌కు నియంత్రిస్తుంది.
ఇదే విధంగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అక్రోట్లు కల్పిస్తాయి. ఇవి శారీరికంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణలు చెప్తున్నమాట. అదే విధంగా వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయని వివరిస్తున్నారు. ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచిదని చెప్తున్నారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఈవీటిని తీసుకోవడం వల్ల మరెన్నో లాభాలు ఉంటాయని కూడా వైద్యులు చెప్తున్న మాట.