గుండె సమస్యలు నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి

Want to escape from heart problems?

0
96

చాలా మంది మహిళలు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది పనులకు దూరంగా ఉంటారు. కానీ నిజానికి రోజు వారీ పనులు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. గుండె సమస్యలు తొలగించడానికి బ్రిస్క్ వాకింగ్ మాత్రమే సహాయ పడదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్రతి రోజూ చేసే పనులు వల్ల అనారోగ్య సమస్యలు కలగవని.. ఇంటి పనులు, గార్డెనింగ్, వంటలు వండడం, సెల్ఫ్ కేర్ ఆక్టివిటీస్ వంటి వాటి వల్ల కార్డియో వాస్క్యులర్ సమస్యలు రావని అంటున్నారు. హెర్బర్ట్ వెర్తియం స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ హ్యూమన్ లాంగివిటీ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్డియాగో చేసిన రీసెర్చ్ ప్రకారం కార్డియో వాస్క్యులర్ సమస్యలు ఇంటి పనులు చేసుకునే మహిళలు ఉండవని తెలుస్తోంది.

కనీసం రోజు రెండు గంటల పాటు ఇంటి పనులు చేసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు రావని తెలుస్తోంది. నాలుగు గంటల కంటే తక్కువ పని చేసుకునే వాళ్లలో 43 శాతం సమస్యలు తగ్గినట్లు తెలుస్తోంది. 30శాతం హార్ట్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. 62% కార్డియో వాస్కులర్ సమస్యలు తగ్గుతున్నట్టు తేలింది.

63 నుండి 90 ఏళ్ల మహిళల్లో పని చేసుకునే వాళ్ళల్లో ఇటువంటి సమస్యలు ఉండడం లేదని తెలుస్తోంది. కాబట్టి వయసు పైబడిన మహిళలు కూడా ప్రతి రోజూ ఇంటి పనులు చేసుకోవడం మంచిదని దీని వల్ల హార్ట్ డిసీజెస్ రావని స్టడీ చెబుతోంది. కాబట్టి మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి వాటికి దూరంగా ఉండకండి.