అందంగా కనబడాలనుకుంటున్నారా? అయితే రోజు ఇది వాడండి..

0
88

ఈ సృష్టిలో అందగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ముఖ్యంగా ఆడవాళ్లు అందంపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకు రోజ్ వాటర్ అద్భుతంగా ఉపయోగపడుతాయి. ఇది చర్మాన్ని సున్నితంగా మరియు కాంతివంతంగా మారుస్తుంది. రోజ్ వాటర్ లో అధికంగా ‘సి ‘విటమిన్  ఉంటుంది. ఇది   చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతేకాకుండా దీని ధర కూడా అందరు కొనే రీతిలోనే ఉంటుంది.

మనం రోజంతా పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ముఖం నిర్జీవంగా మారిపోతుంది. మనం ఎంత కడుక్కున్నా మొఖంపై మురికి వదలదు. అందుకే శుభ్రం చేసుకున్న తర్వాత కాస్త రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ఫేస్‌ను తుడవండి. దీనివల్ల చర్మంపై ఉన్న మురుకుని తొలగించడంతో పాటు..చర్మాన్ని కాంతివంతంగా, మెరిసేలా, సున్నితంగా చేస్తుంది.

ఈ మధ్య మొటిమల సమస్య చాలామందిని బాధపెడుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు రోజు గులాబీనీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కేవలం చర్మానికే కాకుండా..రోజ్ వాటర్ జుట్టుకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతాయి. తలలో చుండ్రు ఉన్నవారు స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు.