త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఇదే బెస్ట్ ఆప్షన్..

0
94

చాలామంది బరువు తగ్గడానికి అనేక రకాల చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి వివిధ రకాల మందులు వాడిన కూడా అనుకున్న మేరకు ఫలితాలు రాకపోగా..వివిధ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లవుతారు. అందుకే ఇంట్లోనే ఈ సహజసిద్ధమైన చిట్కాలు పాటించి మంచి ఫలితాలు పొందండి..

బరువు తగ్గడానికి జీలకర్ర బాగా పని చేస్తుంది. మన ఇంట్లో కూడా దీనిని విరివిగా వాడుతూ ఉంటాము. దీనివల్ల అధిక కొవ్వు కరిగి బరువు తగ్గడానికి వీలవుతుంది. ఇది జీర్ణసంబంధిత సమస్యలను కూడా తరిమికొడుతుంది. మీరు బరువు తగ్గడానికి రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు జీలకర్ర నీళ్లు తాగాలి.

ఒక రాత్రి అంతా జీలకర్రని నానపెట్టేసి ఉదయాన్నే తాగే ముందు దాల్చిన చెక్క పొడి లేదా అల్లం పొడి వేసుకోవచ్చు. కొద్దిగా తేనె వేసుకుని తియ్యగా తీసుకోవచ్చు. అలానే నిమ్మరసం కూడా కావాలంటే వేసుకోవచ్చు.  ఇవన్నీ వేసుకొని తాగడం వల్ల ఆరోగ్యపరంగా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మెంతులు, జీలకర్ర కలిపి తీసుకున్నా కూడా బరువు తగ్గవచ్చు.