మీ పెద‌వులు ఎర్ర‌గా, అందంగా ఉండాలా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

0
109

మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డేలా చేయ‌డంలో పెద‌వులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే పెద‌వులు ఎర్ర‌గా, అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటూ వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వాటితో పాటు ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌తో కూడా మీ పెదవులను ఎర్ర‌గా, అందంగా మార్చుకోవచ్చు.

పెద‌వులు న‌ల్ల‌గా ఉండడానికి అనేక కారణాలు ఉండగా..ముఖ్యంగా హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పెద‌వులు న‌ల్ల‌గా మార‌తాయి. ఈ న‌లుపును క‌ప్పి పుచుకోవ‌డానికి, అలాగే పెద‌వులు అందంగా క‌న‌బ‌డ‌డానికి ర‌క‌ర‌కాల లిప్ స్టిక్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటివల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే లిప్ స్టిక్ ల‌ను వాడ‌కుండా కొన్ని ర‌కాల చిట్కాల‌ను ఉప‌యోగించి స‌హ‌జసిద్ధంగానే మ‌నం పెద‌వులు ఎర్ర‌గా, ఆరోగ్యంగా, అందంగా క‌న‌బ‌డేలా చేసుకోవ‌చ్చు. నిమ్మర‌సంలో పంచ‌దార‌ను, కొబ్బరి నూనెను క‌లిపి పెద‌వుల‌పై సున్నితంగా రాసి 15 నిమిషాల త‌రువాత క‌డిగేయాలి. ఇలా తరచు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. రాత్రి ప‌డుకునే ముందు పెద‌వుల‌కు పాల మీగ‌డ రాసి ఉద‌యాన్నే క‌డిగేయ‌డం వ‌ల్ల పెద‌వులపై ఉండే న‌లుపు త‌గ్గి పెద‌వులు పొడిబార‌కుండా ఉంటాయి.