ప్రజలకు హెచ్చరిక..ఆ జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నిర్ధారణ

Warning to the people..the first omega case was confirmed in that district

0
92

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలంగాణను కలవరపెడుతుంది. తాజాగా కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.

సదరు వ్యక్తి ఈ నెల 15న దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టులో నమూనాలను సేకరించి, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఇవాళ ఫలితాలు రాగా.. ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది.