ఈ వ్యోమగాములు పిజ్జా తినడానికి ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూడండి

Watch this video to see how the astronauts struggled to eat pizza

0
110

మనం బయట పిజ్జా తినాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకుని లేదా అక్కడ ఫుడ్ కోర్ట్ కి వెళ్లి తింటాం, అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా. వ్యోమగాములు పిజ్జా తినాలంటే ఎంత కష్టపడతారో తెలుసా. ఈ వీడియో చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. అంతరిక్షంలో భూమి ఆకర్షణ లేని ప్రదేశంలో తమ పిజ్జాను తామే తయారు చేసుకొని తినాల్సి ఉంటుంది.

అలాంటి వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న కొంత మంది వ్యోమగాములు పిజ్జా పార్టీ చేసుకున్నారు. వారు పిజ్జాను సొంతంగా తయారు చేసుకున్నారు. ఇక గాల్లో ఈ పిజ్జా ఎగురుతోంది. చివరకు నానా కష్టాలు పడి ఆ పిజ్జా తయారు చేసుకున్నారు. థామస్ అనే వ్యోమగామి తన ఇన్ స్టా అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేశారు.

ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. పిజ్జా లవర్స్ మాత్రం వీరి కష్టాన్ని చూసి ఫీల్ అవుతున్నారు. మరికొందరు ఇది భలే ఎక్స్ పీరియన్స్ అంటున్నారు. వ్యోమగాములు పిజ్జా తినడానికి ఎంతలా కష్టపడ్డారో మీరూ చూసేయండి.

https://www.instagram.com/tv/CTH7rJpgeKi/?utm_source=ig_embed&ig_rid=dc76ebf3-22f7-4e46-bb4a-40f063aad8fd