పుచ్చకాయ గింజలు తింటే ఏమవుతుందో తెలుసా

పుచ్చకాయ గింజలు తింటే ఏమవుతుందో తెలుసా

0
101

సమ్మర్ వచ్చింది అంటే కచ్చితంగా అందరూ పుచ్చకాయ తీసుకుంటారు, ఇది బాడీని బాగా కూల్ చేస్తుంది, అంతేకాదు దాహం తగ్గిస్తుంది, ఇది తింటే కడుపు నిండిన భావన వస్తుంది, అంతేకాదు శరీరాన్ని వేడి నుంచి రక్షిస్తుంది. ఇక ఊబకాయం సమస్య రాదు. అయితే పుచ్చకాయల తినేసమయంలో కచ్చితంగా మీకు గింజలు వస్తాయి, కొందరు వీటిని కూడా తింటారు మరికొందరు వీటిని పడేస్తారు.

 

అయితే పిల్లలు ఈ గింజలు తింటే ఏమైపోతుందా అని చాలా మంది పేరెంట్స్ కంగారు పడతారు, అయితే ఇవి మితంగా తింటే పర్వాలేదు ఎక్కువ తినకూడదు, మరీ చిన్నపిల్లలు కూడా ఇవి ఎక్కువ తినకుండా చూసుకోవాలి… ముఖ్యంగా 10 ఏళ్లు దాటిన వారు తింటే ఒకే అంత కంటే చిన్నపిల్లలకు గింజలు తీసి ఇవ్వండి.

 

గింజలను పారేయకుండా వాటిని ఎండబెట్టండి. ఆ తర్వాత అందులోని తేమ పోయేవరకు వేడి చేయండి. ఇవి కంటైనర్ లో వేసి ఉంచండి గాలి తగలకుండా జాగ్రత్తగా ఉంచండి, ఇవి మీరు అప్పుడప్పుడూ తీసుకోవచ్చు, స్నాక్ గా తీసుకోవచ్చు సలాడ్లలో తీసుకోవచ్చు…పుచ్చకాయ గింజల్లో గ్లోబులిన్, అల్బుమిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉంటాయి. దీని వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.. డయాబెటిక్ రోగులు వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.