నీటిని ఎలా తాగాలి ఈ సమయంలో నీరు అస్సలు తాగకూడదు

నీటిని ఎలా తాగాలి ఈ సమయంలో నీరు అస్సలు తాగకూడదు

0
89

చాలా మంది నీరు తాగే సమయంలో గడ గడా తాగేస్తూ ఉంటారు, కొందరు బాగా నడిచి అలసిపోయిన వెంటనే లీటర్ పైనే తాగేస్తు ఉంటారు, గస వస్తోంది అని వేగంగా తాగేవారు ఉంటారు, అయితే తాగేనీరు ఎప్పుడూ వేగంగా తాగకూడదు, నెమ్మదిగా తాగాలి అంటున్నారు వైద్యులు.

ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. కూర్చుని గుటక గుటకగా చప్పరిస్తూ తాగాలి. అలాగే చల్లని నీటిని తీసుకోకూడదు. గోరువెచ్చని నీటిని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు
రావు, ఇక బయట బాటిల్స్ లో నీరు అంత మంచిది కాదు అంటున్నారు, ఇక గోరు వెచ్చని నీరు తీసుకుంటే మీకు జలుబు దగ్గు రాదు, కావాలి అంటే మీరు ప్రయత్నించి చూడండి.

నీరు వేడి చేయడం వల్ల మలినాలు క్రిములు ఉంటే పోతాయి.. జలుబు సమస్య ఉండదు, కాచి చల్లార్చిన నీటిని తాగండి.. అలాగే స్నానం చేసిన తర్వాత నీటిని తాగకూడదు. స్నానం చేసిన వెంటనే నీళ్ళు తాగినట్లైతే చర్మవ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి. నెమ్మదిగా నీరు తాగేవారికి కడుపులో అల్సర్లు ఉండవు, అలాగే చర్మవ్యాదులు రావట, వేగంగా నీరు తాగడం వల్ల మంచిది కాదు అని చెబుతున్నారు వైద్యులు.