బెల్లం అసలు పంచదార కంటే ఎంతో టేస్ట్ ఉంటుంది, ఎవరైనా బెల్లం ముక్క చూడగానే తినాలి అంటారు, అయితే బూరుగుపల్లి బెల్లం అనకాపల్లి బెల్లం ఏది అయినా ఆ టేస్ట్ వేరు, అయితే పంచదార కంటే ఇప్పుడు షుగర్ పేషెంట్లు తాటి బెల్లం సాధారణ బెల్లం తింటున్నారు, అయితే ఇది చాలా మంచిది.
ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా బెల్లం పెట్టడం మంచిది అంటున్నారు నిపుణులు, ఇక బెల్లం వంటకాలు తింటే మరింత బలంగా తయారు అవుతారు..పిల్లల ఎదుగుదలకు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు చాలా అవసరం. ఈ పోషకాలన్నీ బెల్లంలో పుష్కలంగా లభిస్తాయి.
అందుకే నువ్వుల పళ్లీల చెక్కీలు బెల్లంతో చేసి పిల్లలకు ఇవ్వడం మంచిది అంటున్నారు,
చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లేవారికి రక్తహీనత, జీర్ణ సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి. ఇక పిల్లలకు ఐరన్ దీని వల్ల పుష్కలంగా వస్తుంది, పిల్లలకు ఎదుగుదలకు ఎముకల పుష్టికి ఇది ఎంతో మంచిది, అయితే అతిగా ఏదీ తీసుకోకూడదు, అందుకే రెండు రోజులకి ఓసారి అయినా బెల్లం వంటకం పిల్లలకు పెట్టండి అంటున్నారు నిపుణులు.