పెరుగును రోజు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే?

0
126

ఈ సృష్టిలో ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఇష్టంలేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. మ‌నం పెరుగును కూడా తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచడంలో పెరుగు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎముక‌లు దృఢంగా చేయడంతో పాటు..ఎలాంటి సమస్యలను మన దరికి చేరకుండా కాపాడుతుంది. ఇంకా పెరుగు తినడం ద్వారా జీర్ణక్రియ సరిగ్గా జరిగి మలబద్ధకం, వాయువు, ఆమ్లత్వం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

పెరుగు కేవలం ఆరోగ్యాన్ని కాపాడడంలోనే కాకుండా..చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. పెరుగును ముఖానికి రాసి కాసేపటి తరువాత కడుక్కోవడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగిపోయి కాంతివంతంగా కనబడతారు. ఇంకా మొటిమలు, మరకలను తొలగించడంలో కూడా పెరుగు ఉపయోగపడుతుంది.