బియ్యం కొన్న వెంటనే ఇలా చేయడం వల్ల ఎన్ని లాభాలో?

0
138

సాధారణంగా అందరు అన్నం తిని ఆరోగ్యంగా ఉన్నామని భ్రమపడుతుంటారు. కానీ మూడుపూటలా అన్నమే తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందక వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలామంది షాప్ లో నుండి బియ్యాన్ని తెచ్చుకొని వెంటనే వండి తింటారు. కానీ ఈ బియ్యం కొన్ని నెలలుగా నిల్వ ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కావున ప్రతిసారి అన్నం వండుకునే ముందు బియ్యాన్ని శుభ్రంగా కడిగి వండడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగే అవకాశం ఉండదు. లేదంటే, జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా బియ్యం ఇంటికి తెచ్చుకున్న వెంట‌నే అందులో నుండి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకుని వాటిని ఇష్ట దైవం ముందు ఉంచాలి.

ఆ తరువాత క‌ళ్లు మూసుకుని ఓ దేవా వీటిని గ్ర‌హించు, ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉండేలా చూడు, నీ స‌మ‌స్త శ‌క్తుల‌న్నింటినీ వీటిలో నింపి ఆర్థిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు దూరం అయ్యేలా మార్గం చూపు.. అని భ‌గ‌వంతున్ని వేడుకుని ఆ బియ్యాన్ని తీసుకుని మిగిలిన బియ్యంలో క‌లుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలో మంచి గుణాలు చేరి ఇంట్లోని వారందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.