మామిడి పండ్లను అధికంగా తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా?

0
136

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే మనం తెలియక చేసే తప్పుల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వేసవిలో మామిడికాయలు విరివిగా లభిస్తున్నాయని అని అధికంగా తిన్నారంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో మీరు కూడా చూడండి..

మామిడిపండ్లను పరిమిత స్థాయిలో తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పండ్లలో విటమిన్లు ఎ, బి, సి, ఇ, కెలతోపాటు కాపర్‌, పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్‌ ఉండడం వల్ల జీర్ణసంబధిత సమస్యలు తొలగిపోతాయి. కానీ ఈ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా చేకూరే అవకాశం ఉంటుంది.

మామిడి పండ్లును అధికంగా తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ బాగా వివిధ రకాల ఇబ్బందులకు గురవుతారు. కావున డయాబెటిస్‌ ఉన్నవారు ఈ పనులకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. ఇంకా ముఖ్యంగా సహజసిద్ధంగా పండించిన మామిడి పండ్లనే మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.