మందార పువ్వుల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే?

0
121

ప్రకృతిలో ఉండే వివిధ ఔషధ మొక్కల చాలా లాభాలు చేకూరుతాయి. కలబంద, తులసి వంటి మొక్కల వల్ల కలిగే లాభాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముద్దమందారం పువ్వులు వల్ల కూడా  అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో సమస్యలకు వెంటనే చెక్ పెట్టడానికి తోడ్పడుతుంది. అవేంటో మీరు కూడా చూడండి..

తెలంగాణాలో చాలామంది ఈ పువ్వులను దేవుని పూజకు వాడతారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే..ఆయుర్వేద మందులను ఎక్కువగా ఈ ముద్దమందారం పువ్వలతోనే చేస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మందార రసం రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

ముఖ్యంగా ఒంటి నొప్పులకు చెక్ పెట్టడంలో అద్భుతంగా ఉపయోగపడుకుతుంది. ఎలాగంటే.. ముందుగా మందార పువ్వు యొక్క 5 రేకలు మరియు 5 ఆకులు తీసుకోవాలి. వీటిని నీటిలో వేసి 3 వరకు మరిగించి చల్లబరచాలి. అరగంట అయిన తర్వాత త్రాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ విధంగా 21 రోజుల పాటు త్రాగితే 70 శాతం ఒంటి నొప్పులు తగ్గుతాయి.