ఖాళీ కడుపుతో అరటి పండ్లు తింటే ఇన్ని నష్టాలా?

0
109

చిన్నాపెద్ద అని తేడా లేకుండా అందరు అరటిపండ్లు తినడానికి ఇష్టపడతారు. అరటిపండ్లు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని అందరికి తెలుసు. కానీ అరటిపండ్లను తినేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మనలో చాలామంది తెలియక ఉదయం లేవగానే పరిగడుపున రెండు, మూడు తింటుంటాము.

కానీ అలా తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తెలిస్తే మళ్ళీ జీవితంలో ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినరు. వీటిని పరిగడుపున తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం బ్యాలెన్స్ అదుపు తప్పి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేవలం అరటిపండ్లు మాత్రమే కాదు, ఖాళీ కడుపుతో ఎటువంటి పండ్లను తినడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరంలో శక్తిని ప్రేరేపిస్తుంది. అయితే అరటిని ఖాళీ కడుపుతో తినటం వల్ల రోజంతా నీరసంగా తయారవుతారు. ఇంకా నిద్రావస్థ అనుభూతిని కలిగించేలా కూడా చేస్తుంది. కావున పరిగడుపున అరటిపండ్లు తినే అలవాటు ఉంటే త్వరగా మానుకోవడం మంచిది.