సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కలిగే నష్టాలివే?

0
109

ఈ మధ్యకాలంలో చాలామంది పనిభారం, ఒత్తిడి కారణంగా నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మనం రోజు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఏ ఒక్క రోజు కూడా నిద్రను నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు.

నిద్రని కోల్పోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 6 గంట‌ల కన్న త‌క్కువ నిద్ర‌పోతే ఆ త‌రువాతి 48 గంట‌ల పాటు శ‌రీరానికి స‌రిప‌డా ఆక్సిజ‌న్ లభించండని పరిశోధనలో వెల్లడయింది. అంతేకాకుండా మెదడుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

దీనివల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడంతో పాటు..ఏ విష‌యాన్ని స‌రిగ్గా ఆలోచించ‌లేరు. స‌రిగ్గా నిద్ర‌లేకపోవడం వల్ల బ‌రువు కూడా పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. నిద్ర పోక‌పోతే ముఖంపై ముడతలు కుడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా జుట్టు ఉడే ప్రమాదం కూడా ఉంది. అందుకే అందరు కనీసం 6 నుంచి 8 గంట‌ల వరకు నిద్రపోవాలి.