మనిషి ఆరోగ్యం బాగుండాలంటే కేవలం తీసుకునే ఆహారం, వ్యాయామమే కాకుండా మంచి నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితాలు కావడంతో చాలామంది ఎక్కువసేపు నిద్రపోవడం లేరు. కానీ కేవలం నిద్రపోకపోవడం వల్లే కాకుండా..ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 6 నుంచి 7 గంటలకు మించి నిద్రపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు ఉంటే.. మీరు తరచు వెన్నునొప్పి సమస్యతో బాధపడే అవకాశం అధికంగా ఉంటుంది. ఎందుకంటే నిద్రలో ఎలా పడితే అలా పడుకోవడం వల్ల కూడా కండరాలపై ఒత్తిడి కలగడం వల్ల వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది.
ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల శరీరంలోని కండరాలు, నరాలు దృఢంగా మారి రోజంతా అలసిపోయినట్టు ఉంటారు. ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల డిప్రెషన్ పెరిగి వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అధికంగా నిద్రపోవడం వల్ల గుండెసంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.