క‌రోనా బూస్ట‌ర్ డోస్ పై నిపుణులు ఏమంటున్నారు

What experts are saying about the Corona booster dose

0
87

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా టీకాలు వేస్తున్నారు. అన్నీ దేశాల్లో కూడా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లు కొన‌సాగుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్ప‌టికే 60 ఏళ్లు దాటిన వారికి టీకా వేయ‌డం జ‌రిగింది. ఇక క‌రోనా వైర‌స్ కూడా ప‌లు రూపాలు మార్చుకుంటోంది.మానవాళికి మరింత ముప్పుగా పరిణమిస్తోంది.

మొదట్లో వ్యాక్సిన్ ఒకటే డోసన్నారు. తర్వాత అదికాస్తా రెండుగా మారింది. కొన్నాళ్లకు దానికి బూస్టర్ డోస్ కూడా పడాలన్నారు. అయితే ప‌లువురు నిపుణులు చెప్పేదాని ప్ర‌కారం ఇంకా దీనిపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా అనేక వేరియంట్లు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా బూస్ట‌ర్ డోస్ లు కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంకా దీనిపై లోతైన అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయి.

ఇంకా బూస్టర్ డోసును సిఫార్సు చేసేందుకు తగ్గ సరైన సమాచారం లేదంటోంది డబ్ల్యూహెచ్వో.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి టీకాలిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు తొలి టీకా మ‌లిటికా ప‌డిన వారికి. ఒక‌వేళ బూస్ట‌ర్ డోస్ తీసుకోవాలి అంటే ఏడాది త‌ర్వాత ఇస్తారు.