Watermelon Benefits |వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయలు ముక్కలుగా కట్ చేసి రోడ్డుపైన కూడా ఎక్కడపడితే అక్కడ అమ్ముతూ ఉంటారు. ఎండలో తిరిగేవారు పుచ్చకాయ తింటే కొంచెం అలసట తీరినట్టుగా అనిపిస్తుంది. పుచ్చకాయ వేసవి దాహార్తిని కూడా తీరుస్తుంది. అయితే ఈ పుచ్చకాయను ప్రతిరోజు తీసుకోవడం మంచిదేనా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
Watermelon Benefits |వేసవిలో క్రమం తప్పకుండా ప్రతిరోజు పుచ్చకాయను తినడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, విటమిన్ బీ5, విటమిన్ బీ6, విటమిన్ బీ1 పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు అందించడంలో పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పుచ్చకాయను రోజువారి డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Read Also: స్త్రీ తన కన్నా వయసు ఎక్కువున్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి..?
Follow us on: Google News, Koo, Twitter