మన దేశంలో నాన్ వెజ్ తినేవాళ్లు భారీ సంఖ్యలో ఉన్నారు, ఇటీవల నాన్ వెజ్ తినే వారి సంఖ్య పెరిగింది, ఇక చికెన్ ని ఎక్కువగా తీసుకుంటారు, మటన్ చేపల కంటే చికెన్ వాడకం ఎక్కువగా ఉంటుంది.. అయితే చాలా మంది మటన్ ని అంత ఇష్టంగా తినరు.. కాని దీని వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి… ఏ ఆహారం అయినా అతిగా తింటే అనర్దమే …అయితే మటన్ చికెన్ ఏది ఎక్కువగా తిన్నా ఇబ్బందులు వస్తాయి.. అందుకే మీరు మితంగా తింటే మంచి పోషకాల అందుతాయి.
మటన్ లో బి1, బి2, బి3, బి9, బి12 విటమిన్లు ఉంటాయి. విటమిన్-ఇ, కె కూడా పుష్కలంగా అందుతాయి, ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా అందుతాయి, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. మీ శరీరంలో ఎక్కువగా ఉన్న కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి.
ఎర్రరక్త కణాల ఏర్పాటుకి తోడ్పడతాయి.. చర్మం యవ్వనంగా మారుతుంది, అయితే ఇందులో అతి మసాలా వేసుకుని రోజూ తింటే సమస్యలు వస్తాయి.. వైద్యులు చెప్పే దాని ప్రకారం పది హేను రోజులకి ఓసారి మటన్ తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు, జబ్బులు రావు.