కొంత మందికి కొన్ని వింత ఆలోచనలు ఉంటాయి, అసలు మనం నీటితోనే ఎందుకు ఈ మందులు వేసుకోవాలి మనం కాఫీ, టీ, పాలు, జ్యూస్ ఇలా దేనితో అయినా వేసుకోవచ్చు కదా? ఇవీ లిక్విడ్ కదా అని అనుకుంటారు. అయితే వైద్యులు ఇలాంటి ఆలోచన మీ మనసులోకి తీసుకురావద్దు అని చెబుతున్నారు. దేనికైనా ఓ కారణం ఉంటుంది సో ఆ రీజన్ ఏమిటో చూద్దాం.
పాలు, టీ, కాఫీతో మాత్రలు వేసుకోవడం ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదు అంటున్నారు వైద్యులు. గుర్తు ఉంచుకోండి పాలతో మందులు వేసుకుంటే చాలా వరకూ అలర్జీ వాంతుల సమస్యలు వస్తాయి. కాఫీ, టీలతో మాత్రలు వేసుకుంటే ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయట.
యాంటీ బయోటిక్స్ వంటి కొన్ని రకాల మాత్రలు పాల తో వేసుకుంటే పూర్తి ప్రభావం చూపించవు, చెప్పాలంటే 15 శాతం కూడా పనిచేయవు .ఇంకొందరు జ్యూస్ తో తీసుకుంటారు. దీని వల్ల కడుపులో చాలా ప్రమాదం జరుగుతుంది. అంతే కాదు గ్యాస్ సంబంధిత మందులు నీటితోనే తీసుకోవాలి అంటున్నారు వైద్యులు.