పంచదార తినడం మానేస్తే ఏమవుతుంది?

-

మనం ప్రతి రోజూ తినే ప్రతి వస్తువు మన శరీరానికి ఏదో ఒక మేలు చేస్తుందని వైద్యులు చెప్తారు. కానీ వారు కూడా ఈ జాబితా నుంచి పంచదార(Sugar)ను మినహాయిస్తారు. పంచాదర వినియోగం వల్లే నష్టమే తప్ప లాభాలు ఏమీ లేవని నిపుణులు ఘంటాపథంగా చెప్తారు. కానీ మనదేమో అలవాటు పడిపోయిన ప్రాణమాయా.. పంచదార వదులుకోవడం అంటే ప్రాణం పోతున్నట్లు ఫీల్ అవుతాం. కానీ నిజంగా పంచదార తినడాన్ని మానేస్తే లాభాలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్తున్నారు ఆహార, వైద్య నిపుణులు మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

- Advertisement -

పంచదార(Sugar) మానేయాలి అనే ఆలోచనే మనలో ఒక మంచికి నాంది పలుకుతుందనేది పలువురు నిపుణుల మాట. ఇక అనుకున్నట్లు పంచదారను తినడం మానేస్తే వారి పూర్తి ఆరోగ్యం మెరుగుతుపడుతుందని, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినాలన్న కోరిక వారిలో పెరుగుతుందని పోషకార నిపుణులు చెప్తున్నారు. పంచదార తినడం మానేసిన వారు బరువు తగ్గుతారని, శరీరంలో చేరే క్యాలరీల సంఖ్య కూడా బాగా తగ్గుతుందని వివరిస్తున్నారు. చక్కెరను ఏ రూపంలో కూడా తీసుకోకుండా రెండు మూడు రోజుల్లోనే మార్పును మనం గమనించగలుతామని కూడా అంటున్నారు. దాంతో పాటుగా హైబీపీ, ట్రైగ్లిజరైడ్స్, శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు రావని, ఉంటే తగ్గుతాయని వివరిస్తున్నారు. నోటి ఆరోగ్యానికి, దంతాల ఆరోగ్యానికి కూడా చక్కెర మానేయడం ఉత్తమం అని చెప్తున్నారు.

పంచాదర మానేయడం వల్ల మన శీరీరంలోని శక్తి స్థిరంగా ఉంటుందని, స్థిరమైన శక్తి స్థాయిలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని చెప్తున్నారు. దాంతో పాటుగా టైప్2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని, మానసిక స్థితి ఆరోగ్యకరంగా మారుతుందని, మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం వంటివి కూడా తగ్గుతాయని నిపుణులు వివరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని, కడుపుబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయని, ఇవన్నీ జరగాలంటే చక్కెరను పూర్తిగా మానేయాలని, ఏ రూపంలో కూడా పంచదారను తీసుకోకూడదని అంటున్నారు.

Read Also: అల్లంతో అదరగొట్టే ఆరోగ్య ప్రయోజనాలు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...