కొన్ని ఆహారాలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పలు అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని తీసుకోవడంలో అశ్రద్ద ఉంటే చాలా ప్రమాదం, అయితే ఓ వ్యక్తి పుట్టగొడుగులతో చేసిన పనికి ఏకంగా నెల రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు.
అమెరికాలోని ఓ 30 ఏళ్ల వ్యక్తి పుట్టగొడుగులతో తయారు చేసిన కషాయాన్ని రక్తంలో ఎక్కించుకున్నాడు.
అయితే దానికి ఓ కారణం చెబుతున్నాడు తాను బై పోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నా, ఇది తగ్గాలి అంటే పుట్టగొడుగుల్లో ఉండే సిలోసైబిన్ పదార్థంతో నయమవుతుందని తెలుసుకున్నా, అందుకే వాటితో టీ చేసుకున్నా.
సైకీడెలిక్ పుట్టగొడగులు మ్యాజిక్ మష్రూమ్స్ తీసుకువచ్చి నెల రోజులు వాటిని టీ రూపంలో తయారుచేసుకుని రోజూ తాగాను అని చెప్పాడు, ఇలా చేసుకున్న తర్వాత అతనికి డయేరియా వచ్చేసింది రక్తం వాంతులు అయ్యాయి చివరకు నెల రోజులు ఐసీయూలో ఉండి బయటపడ్డాడు.