మనం ఏ నూనె వాడితే మంచిది – ఆరోగ్యానికి ఏ ఆయిల్ బెటర్

0
101

మనం మార్కెట్లో చాలా రకాల నూనెలు చూస్తు ఉంటాం. పామాయిల్, సన్ ఫ్లవర్, వేరుశనగ, నువ్వులనూనె, ఆలీవ్ ఆయిల్, ఇలా అనేక రకాల ఆయిల్స్ ఉంటాయి. అయితే ఏ ఆయిల్ వాడినా మితంగానే వాడాలి. అతిగా వాడితే అనారోగ్యమే.
మరి వంటల్లో వాడే ఏ నూనెలో ఏముందో ఎప్పుడైనా తెలుసుకున్నారా. వంటకాలకు ఏది వాడితే బెటర్ అనేది తప్పక తెలుసుకోండి.

వేరుశెనగ నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్, ఆలివ్, పామ్ ఆయిల్. ఇలా అన్నీ రకాల నూనెలు వాడే వారు ఉన్నారు. మరికొందరు కేవలం ఒకే రకమై ఆయిల్ వాడుతూ ఉంటారు. మనం వాడే ఒక్కో రకం నూనెలో ఒక్కో రకమైన పదార్థాలు ఉంటాయి.

విటమిన్-A లోపంతో పాటు క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులను నివారించేందుకు పామ్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది.
బరువు తగ్గాలంటే పామ్ ఆయిల్ వాడండి. అలాగే విటమిన్-E ఎక్కువగా ఉండే వేరుశెనగ నూనె గుండె ఆరోగ్యానికి మంచిది.
ఇది మితంగా వాడితే కొలెస్టరాల్ సమస్య ఉండదు. తర్వాత సోయాబీన్ నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

ఈ మధ్య బాగా వాడుతున్న నూనె ఆవ నూనె. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, చర్మ సమస్యలున్నవారు ఇది వాడితే మంచిది. సన్ ప్లవర్ ఆయిల్లో విటమిన్-E ఎక్కువగా ఉంటుంది. గుండె,, రోగ నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ పనితీరుకు ఇది చాలా మంచిది. నువ్వుల నూనె ఎముకలు పుష్టిగా అవ్వాలంటే ఇది వాడితే మంచిది. ఏ నూనె అయినా రెండు మూడుసార్లు హీట్ చేసి మళ్లీ మళ్లీ వాడద్దు. బజ్జీలు, పకోడీలు తాళింపులకి ఇలా వాడింది వాడద్దు క్యాన్సర్లు ఇదే కారణం.