మనం ఈ రోజుల్లో షుగర్ ఊబకాయం సమస్యలు రాకూడదు అని గోదుమలతో చేసిన చపాతీలు తింటున్నాం.. మరికొందరు మిల్లెట్స్ తో చేసిన ఫుడ్ తీసుకుంటున్నారు… అయితే కొందరు నిత్యం చపాతీ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తున్నాయి అంటున్నారు… సో దీనికి కారణం ఏమిటి ఎందుకు వస్తున్నాయి అనేది సింపుల్ గా చెప్పుకుందాం.
చపాతీలు అంటే గోధుమలతో చేస్తాం, ఈ గోదుమల్లో గ్లూటెన్ ఉంటుంది ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు… అప్పుడప్పుడూ తీసుకుంటే ఒకే రోజూ తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.. అందుకే ఈ గ్లూటెన్ లేని రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు వంటి మిల్లెట్స్ తో చేసిన రొట్టెలను తినడం మంచిదని చెబుతుంటారు.
ఇక గోదుమలతో చేసిన ఫుడ్ కి అరగడానికి సమయం పడుతుంది… మిల్లెట్స్ ఫుడ్ ఈజీగా అరుగుతుంది, అసలు ఈ గ్లూటెన్ అనేది ఓ ప్రొటీన్. జీర్ణం చేసుకోవడం కాస్త కష్టం. ముఖ్యంగా కొందరికి తక్కువ జీర్ణ సామర్థ్యం ఉంటుంది వారు గ్లూటెన్ ఫుడ్ ఎక్కువగా తింటే అది పేగుల్లో ఉంటుంది… దీని వల్ల జీర్ణప్రక్రియ నెమ్మదిస్తుంది.. మలబద్దకం పెరుగుతుంది, సో కడుపునొప్పి వస్తుంది.
మరి మీరు చపాతిలాంటివి పూరీ అలాంటివి గోదుమలతో చేసిన ఫుడ్ తింటే మలబద్దకం కడుపునొప్పి వస్తే మీకు గ్లూటెన్స సెన్సిటివీటి ఉంది అని అర్దం చేసుకోవాలి… లేదు అంటే మీరు వారానికి మూడు రోజులు చపాతీ తీసుకుని మరో నాలుగు రోజులు మిల్లెట్స్ ఫుడ్ తీసుకోండి అంటున్నారు వైద్యులు.