ప్రస్తుత జీవనవిధానంలో ఎంతోమంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అది మానసిక అనారోగ్యం కావొచ్చు. శారీరక అనారోగ్యం కావొచ్చు. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి. మానసిక వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి. ఒక వ్యక్తి మానసిక వ్యాధికి గురయ్యాడని మనకు ఎలా తెలుస్తుంది. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి మనిషి కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. సంపూర్ణ ఆరోగ్యం అంటే మానసిక, శారీరక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఆరోగ్యంలో ఒక భాగం మానసిక ఆరోగ్యం. మనసు అనేది మెదడులో ఉంటుంది. మెదడులో ఉన్న భాగాలు ఒక భాగంతో మరొకటి అనుసంధానంగా ఉంటూ మనసు పని చేస్తుంది. ఆలోచనలు, ప్రవర్తనలు, స్పందనలు అనేవి మనసు యొక్క పనులు. మానసిక ఆరోగ్యం చెడ్డది అంటే వీటిలో లోపాలు కనిపిస్తాయి.
మనిషి ప్రవర్తన చూసి వారి ఆరోగ్య స్థితిని తెలుకోవచ్చు. కొంతమంది ఒంటరిగా వుంటూ తమలో తాము మాట్లాడుకుంటారు. దీనికిహాలోజినేషన్ అంటారు. కొన్ని విషయాలు ఆధారాలు లేకుండానే భ్రమ పడుతుంటారు. తినే దాంట్లో ఏదైనా కలిపారని, ఎవరిదైనా ఇస్తే ఇందులో విషం కలిపార అన్న భ్రమలో ఉండిపోతారు. అలాగే కారణం లేకుండానే ఏడుస్తారు. దేనిమీద శ్రద్ధ ఉండదు. అలాగే వారి యొక్క ప్రతిస్పందన తగ్గుతూ ఉంటుంది. జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.