ఆయిల్ పుల్లింగ్ ఈ మాట ఎక్కువగానే వింటాం, అయితే ఎలా చేయాలో అని చాలా మందికి డౌట్ ఉంటుంది, అయితే కొందరు ఈజీగా చేస్తారు మరికొందరు చేయడానికి ఆలోచిస్తారు, అయితే ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా మంచిది అంటున్నారు నిపుణులు.
ఆయిల్ పుల్లింగ్ అనేది ఓ ఆయుర్వేద టెక్నిక్. తెల్లవారుజామున ఖాళీ కడుపుతో నోటిలో నూనేను వేసుకుని పుక్కలించి తర్వాత ఉమ్మివేయాలి. 10 నుంచి 15 నిముషాల పాటు ఈ విధంగా చేయాలి.
ఇలా చేయడం వల్ల నోటి నుంచి హానికరమైన బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది.
ఇక నోటి పూత, చిగురు వాపు, పల్ల పై పాచి, ఇలాంటి సమస్యలు ఉండవు. మరి ఆయిల్ పుల్లింగ్ కు ఏ నూనె వాడాలో చూద్దాం. ఏదైనా సరే ఓ టేబుల్ స్పూన్ నూనే చాలు, గానుగ నుంచి తెచ్చిన కొబ్బరి నూనె, బాదం నూనె, నువ్వుల నూనె, తీసుకుంటే మంచిది..నోటిలో వేసుకుని మింగకుండా దాదాపు 10 నుంచి 15 నిముషాల పాటు పుక్కిలించాలి. ఇక పామాయిల్ ఆముదం లాంటివి తీసుకోవద్దు. ఇలా 15నిమిషాలు చేసి తర్వాత అది పుక్కిలించాలి.
1.దంతాలు బాగుంటాయి
2. దుర్వాసన పోతుంది
3. చిగురు సమస్యలు ఉండవు
4. హనికర బ్యాక్టిరీయా పోతుంది
5.. లాలాజలం ఉత్పత్తి మెరుగవుతుంది.
6..రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మీకు వీలైతే ఎక్కువ కొబ్బరి నూనె దీనికి వాడితే మంచిది అంటున్నారు నిపుణులు