టెఫ్ ఇది ఎప్పుడూ వినలేదు అని మీరు అనుకోవచ్చు. మన ఇండియాలో దీనిని ఇప్పుడిప్పుడే చాలా మంది వాడుతున్నారు. మొక్కల నుంచి వచ్చే ఫుడ్ ఇది. ఇక ఇందులో కాపర్, ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో అథ్లెట్స్ పరిగెత్తే వాళ్ళు దీనిని ఎక్కువగా తీసుకుంటారు.
యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ,నెదర్లాండ్స్ లో దీనిని పండించడం జరుగుతోంది. ఇక మన భారత్ లో కూడా ఇవి ప్యాకింగ్ చేసి వస్తున్నాయి. ఇప్పుడు మనకు మెట్రో సిటీస్ నుంచి టౌన్స్ లో కూడా దొరుకుతున్నాయి. అలాగే ఆన్ లైన్ గ్రాసరీ వెబ్ స్టోర్లలో దొరుకుతున్నాయి.
టెఫ్ లో ప్రోటీన్స్ మరియు మినరల్స్ ఉంటాయి. బాడికి కావలసిన ప్రోటీన్ కంటెంట్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైబర్ కూడా ఇందులో పుష్కలంగా ఉంది. చెప్పాలంటే గోధుమలు, బార్లీ కంటే కూడా టెఫ్ చాలా ఉత్తమమైనది. ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. అందుకే గోధుమకంటే ఇది ఉత్తమం. మధుమేహం ఉన్న వారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచడానికి టెఫ్ చాలా సహాయపడుతుంది.