ఈ మధ్య చాలా మంది ఒళ్లు వస్తోంది, బరువు పెరుగుతున్నాం అని వెయిట్ లాస్ లో బాగా పాపులర్ అయిన కీటో డైట్ పాటిస్తున్నారు. అయితే దీని వల్ల ప్రమాదం కూడా ఉంది అంటున్నారు నిపుణులు.
కీటో డైట్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈమధ్య సన్నగా తయారు అవ్వాలి అని చాలా మంది సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యులవరకూ చాలా మంది బరువును తగ్గించుకోవడానికి ఈ డైట్ ఫాలో అవుతున్నారు… కీటో డైట్ అంటే కీటో జెనిక్ ఫుడ్ అని అర్థం. ఇలా డైట్ ఫాలో అయితే మన శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది.
మరి ఎలా కొవ్వు తగ్గుతుంది అంటే మనం రోజూ తినే ఆహారంలో వచ్చే కార్బొహైడ్రేట్ ఫుడ్ వల్ల కాస్త బరువు పెరుగుతున్నాం, అందుకే ఈ డైట్ లో ఉన్న వారు కార్బొహైడ్రేట్ ఫుడ్ ను పూర్తిగా తీసుకోరు
ఈ సమయంలోబాడీలో ఉండే కొవ్వే కరుగుతుంది తప్ప అదనంగా కొవ్వు ఏర్పడే ఛాన్స్ లేదు.
ఇలా చేయడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. ఇది కీటో డైట్ కాని వైద్యుల సలహాతోనే దీనిని పాటించాలి అంటున్నారు నిపుణులు.